Posts

Latest Post

ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలు విడనాడాలి

Image
యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగూరు వలి ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, ప్రాంతీయ కార్యాలయ కన్వీనర్ ఏ వినోదరావు లు డిమాండ్ చేశారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయం లో శుక్రవారం జరిగిన యుటిఎఫ్ మధిర మండల ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ 8 వ వేతన సంఘం పేరుతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాసే విధంగా నిబంధనలను రూపొందించడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల ఆలస్యంగా కేంద్రం ఏర్పాటుచేసిన 8 వ వేతన సంఘం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు ప్రతి ఉద్యోగిని, పెన్షనర్ని ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయన్నారు. పెన్షనర్స్ కి పిఆర్సి వర్తింపులో, డి ఏ వర్తింపులో  అసంబద్ధ నిబంధనలను రూపొందించారన్నారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి గురించి పట్టించుకోకపోవడం, ఐదు డిఏలు ప్రకటించకపోవడం, సర్వీస్ లో ఉన్న రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల అనేక బిల్లులు పెండింగ్లో ఉంచటం ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం అన్నారు. కేంద్ర, ...

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కిన్నెరసాని గురుకుల పాఠశాల విద్యార్థి

Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్ధి ఎంపికయ్యాడు. ఈ పాఠశాల్లో 10 వ తరగతి చదువుచున్న విద్యార్ది  కే. హర్షిత్ తన ప్రతిభను చాటి అండర్–17 వయో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున, ఉపాధ్యాయులు విద్యార్థి హర్షత్ ను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు

రాష్ట్ర స్థాయి పోటీలకు కిన్నెరసాని గిరిజన గురుకుల విద్యార్ధుల ఎంపిక

Image
భినందించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్, బేస్ బాల్ సెలక్షన్ పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. సాఫ్ట్ బాల్ అండర్–17 విభాగంలో ఇ. హర్షవర్ధన్, అండర్–14 విభాగంలో ధర్మ నాయక్,  బి. రిత్విక్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అదే విధంగా బేస్ బాల్ అండర్–14 విభాగంలో ప్రవీణ్, అండర్–17 విభాగంలో జశ్వంత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు..

వరద ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు

Image
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి  పెద్ద చెరువు సంరక్షణ, కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి      ( తాళ్లూరి అప్పారావు, మధిర ) వర్షాల వలన మధిరలో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, వరద ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు మధిర పట్టణం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ శనివారం పర్యటించారు. వర్షం కురిసినప్పుడు జలమయం అయ్యే కాలనీలు, వరద ఇబ్బంది పడే లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. మధిర మున్సిపాలిటీలోని హనుమాన్, ముస్లిం కాలనీ లను క్షేత్రస్థాయిలో కాలినడకన తిరిగుతూ వరద ప్రభావ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  లోతట్టు ప్రాంతాల వరద ముంపుకు శాశ్వతంగా సమస్యలు పరిష్కారానికి టౌన్ మ్యాప్ లను పరిశీలిస్తూ అధికారులకు అదేశాలు ఇచ్చారు. స్టామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్డు వెడల్పు పెంచేందుకు...

యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

Image
ఖమ్మం యస్.బి.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల సి.యస్.ఈ. విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు గంటెల ప్రభాకర్ , ఆచార్య నాగార్జున విశ్వ విధ్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. చింతకాని మండలంలోని అనంత సాగర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ , “ ఎన్హాన్స్డ్ మెథడాలజీస్ ఫర్ డేటా సెక్యూరిటి ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్" అనే అంశం పై డా. బొబ్బా బసవేశ్వర రావు పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు. ఇందుకు గాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుండి పట్టాను పొందినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ , సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి. ధాత్రి , ప్రిన్సిపల్ డా. జి. రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభాకర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో క్లౌడ్ కంప్యూటింగ్ , డేటా సెక్యూరిటీ , డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై పరిశోధన ద్వారా పొందిన అనుభవం విద్యార్థులకు , సి.యస్.ఈ విభాగ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశా భావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు ప్రభాకర్ ను అభినందించారు. అభినందించిన వారిలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్ , గంధం శ్రీనివాసరావు , డా ...

రాష్ట్ర రెండో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలి

Image
పెండింగ్ ఐదు డి ఏ లను విడుదల చేయాలి ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి ఎస్ టి ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రంలో రెండో పిఆర్సి నివేదికను ప్రభుత్వం తీసుకుని అమలు చేయాలని, పెండింగ్ ఐదు డిఏ లను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ టి ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  బి నాగరాజు, ఈ వీరయ్య ల అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్ శివ శంకరన్ అధ్యక్షతన ద్విసభ్య కమిటీతో ఏర్పాటైన పిఆర్సి గడువు ముగిసినప్పటికీ నివేదికను స్వీకరించకపోవడం, ఫిట్మెంట్ ప్రకటించకపోవడం శోచనీయం  అన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏ లను తక్షణమే ప్రకటించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు అన్నిటిని క్లియర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ టి ఎఫ్ ఐ (స్కూల్ ట...

దేశానికి ఆదర్శంగా విద్యారంగం అభివృద్ధి

Image
పోటీ పరీక్షల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు  వచ్చే విద్యా సంవత్సరం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన సోలార్ రూఫ్ టాప్ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించారని, వారి అంచనాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం మధిర క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి అధికార బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల కోసం నియోజక వర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు కావలసిన పూర్తి మెటీరియల్ తో పాటు డిజిటల్ లైబ్రరీ ఈ నాలెడ్జ్ సెంటర్లలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్ లైన్ లో కోచింగ్ ఇప్పిచ్చే ఏర్పాటు ...